టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. గత ఏడాది దేవర తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ అదే ఫామ్ తో పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తూ ఉండగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటూ ఉన్నది. ఈ సినిమా పైన ఇటీవలే విడుదలైన పోస్టర్స్, షూటింగ్ అప్డేట్ సంబంధించి ఫోటోలు చూసి అభిమానులు మరింత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ ఉన్నారు.


బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. వీటికి తోడు దేవర 2 సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ తో కూడా మరొక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలతో మరొకవైపు వెకేషన్ అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.తాజాగా ఎన్టీఆర్కు సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంశంగా  మారుతున్నది.


అదేమిటంటే ఎన్టీఆర్ తాజాగా ధరించినటువంటి ఒక షర్టు అందరిని ప్రత్యేకించి మరి ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా సింపుల్ గా పువ్వుల డిజైన్ కలిగే ఉన్న ఈ షర్టు కాస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ షర్ట్ ధర సుమారుగా రూ .85000 ఉన్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం విన్న తర్వాత పలువురు అభిమానులు , నెట్టిజెన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఎన్టీఆర్ ధరించిన ఫ్యాంట్, వాచ్, షూష్ వంటి వాటి పైన కూడా ఎంత ధర ఉన్నాయనే విషయాన్ని అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ ధరించినటువంటి ఈ షర్ట్ వల్ల మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నారు. అందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: