రష్మిక మందన ఈ చిన్నదాని పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది మొదట కన్నడ సినిమాతో చిత్రపరిశ్రమకు పరిచయమైంది. అక్కడ మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది 2018 సంవత్సరంలో ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ చిన్నది ఇప్పటికీ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన హవాను కొనసాగిస్తోంది.


రష్మిక సినీ ఇండస్ట్రీకి పరిచయమై చాలా సంవత్సరాలు అయినప్పటికీ తన సినిమాల ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తూనే ఉంది. తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్ తో ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతుంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతోంది. బాలీవుడ్ లోనూ ఈ చిన్నది విపరీతంగా సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి.

 
రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడం ఈ చిన్నదానికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే రష్మిక తన అభిమానులతో మాట్లాడుతూ ఓ వీడియోను షేర్ చేసుకుంది. ఆ వీడియో చివర్లో రష్మిక తన అభిమానులకు కిస్ ఇచ్చింది. 

దీంతో ఈ వీడియోని చూసిన చాలామంది నీకు ఎప్పుడూ ముద్దులు పెట్టడమే అలవాటా అంటూ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఇక రష్మిక అభిమానులు తనను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా నీకు ముద్దు పెట్టడమే వచ్చా అని కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్ల పైన రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: