టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపును అందుకుంటారు. ఇక మరికొంతమంది వారి నటన అద్భుతంగా ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక పెద్దగా సక్సెస్ కాలేకపోతారు. అలాంటి వారిలో నటి నేహా శర్మ ఒకరు. ఈ చిన్నది తెలుగులో స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. వరుణ్ సందేశ్, రామ్ చరణ్ లాంటి మెగా హీరోలతో కలిసి సినిమాలు చేసినప్పటికీ నేహా శర్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. నేహ శర్మ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది.



అనంతరం సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదట రామ్ చరణ్ తో కలిసి చిరుత సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా అనంతరం ఈ చిన్నది వరుణ్ సందేశ్ తో కలిసి కుర్రాడు సినిమాలోనూ నటించింది. ఈ సినిమా కూడా మంచి విషయాన్ని అందుకుంది. అనంతరం ఈ చిన్నది పెద్దగా సినిమా అవకాశాలు లేక ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించింది. అనంతరం తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు రాకపోవడంతో నేహా శర్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు వెళ్ళింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు అందుకుంది.

అక్కడ ప్రేక్షకుల మనసులను కట్టిపడేసిన ఈ చిన్నది బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా తన అందమైన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మతులు పొగోడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నేహా శర్మకు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతోంది. నేహా శర్మ బాలీవుడ్ నిర్మాతతో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. చాలా కాలం పాటు ప్రేమలో మునిగి తేలుతున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా బాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ నిర్మాత ఎవరు ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది. మరి ఈ జంట ఎప్పుడు వివాహం చేసుకుంటారో చూడాలి. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: