బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తోంది. తిరిగి మళ్లీ ఇండియాకి వచ్చి పలు సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది. మహేష్ బాబుతో SSMB 29 సినిమాలో నటిస్తూ ఉండగా ఇలాంటి సమయంలోనే బాలీవుడ్ హృతిక్ రోషన్  గతంలో నటించిన క్రిష్ చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాలకు సీక్వెల్స్ అన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. 2013లో క్రిష్ -3 కొనసాగింపు ఉంటుంది అంటూ క్రిష్ -4 ను ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి స్వయంగా హృతిక్ రోషన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.


ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నట్లు బాలీవుడ్లో ట్రాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించి కథ చెప్పారని ప్రియాంక చోప్రా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రియాంక చోప్రా క్రిష్ -4 సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం ఏకంగా 25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు అడుగుతున్నదట. ఈ విషయం విన్న నిర్మాతలు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారని బాలీవుడ్  మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి డైరెక్షన్లో నటిస్తున్న సినిమాలో కూడా ప్రియాంక చోప్రా కి సరైన పాత్ర ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఎప్పుడైతే రాజమౌళి సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందో అప్పటినుంచి ప్రియాంక చోప్రాకి పలు చిత్రాలలో అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా లెవెల్లో చిత్రాలలో నటిస్తూ ఉన్నది.. ప్రియాంక చోప్రా కు గ్లోబల్ స్థాయిలో పేరు ఉండడంతో ఇమేను ఎక్కువగా చాలామంది హీరోయిన్గా ఎంపిక చేయడానికి మక్కువ చూపుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: