టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు కాగా నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. తన కెరీర్ లో నిత్యామీనన్ ఎక్కువగా అభినయ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నిత్యామీనన్ తాజాగా ఒక సందర్భంలో చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని స్వీకరించి మీరేంటో ప్రూవ్ చేసుకోవాలని నిత్యామీనన్ చెబుతున్నారు. కొత్తదనంతో కూడిన పాత్రలు ఎంచుకుంటున్న నిత్యామీనన్ తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు. ప్రస్తుతం ఇడ్లీ కడై అనే సినిమాతో ఆమె బిజీగా ఉండటం గమనార్హం. తన రూపాన్ని మార్చుకోవాలని చాలామంది విమర్శలు చేశారని ఆమె కామెంట్లు చేశారు.
 
స్కూల్, కాలేజ్ డేస్ నుంచే నా జుట్టుతో ఎప్పుడూ సమస్య ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. నా తొలి సినిమా చేస్తున్న సమయంలో నా జుట్టు ఏంటి వింతగా ఉందని ఆన్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అందరూ ఆ రింగుల జుట్టునే ఇష్టపడుతున్నారని నిత్యామీనన్ తెలిపారు. కానీ ఆరోజుల్లో ఇది అందరికీ ఒక వింతలా అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. నేను పొట్టిగా, లావుగా ఉన్నానని కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయనే కామెంట్లు సైతం వినిపించాయని నిత్యామీనన్ వెల్లడించారు.
 
ఈ తరహా మాటలు సైతం నాకు వినిపించాయని ఈ మాటలు నన్ను చాలా ప్రభావితం చేస్తాయని ఆ మాటలు ప్రభావితం చేస్తే మాత్రమే సవాళ్లను స్వీకరించగలనని ఆమె పేర్కొన్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా నా రూపాన్ని మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదని ఆమె తెలిపారు. నాలాగే ఉండి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నానని నిత్యామీనన్ వెల్లడించారు. నిత్యామీనన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిత్యామీనన్ సరైన ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మరిన్ని అద్భుతాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: