
గతంలో మా కాంబోలో వచ్చిన ఓం లాంటి మరో మంచి ఐడియా వస్తే ముందు ఆయనకే చెబుతానని ఉపేంద్ర తెలిపారు. సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా అని ఎందుకు అంటున్నామో సినిమా చూస్తే మీకే అర్థమవుతుందని ఆయన తెలిపారు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగుందని కొన్నిరోజుల క్రితం పెద్ది షూట్ లో పాల్గొన్నానని నేను తెలుగులో డైలాగ్ చెప్పడం పూర్తైన వెంటనే వర్షం రావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రకృతి నాకు అలా ఆహ్వానం పలికింది అని అనుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. పెద్ది టీమ్ అంతా స్నేహపూర్వకంగా ఉంటారని డైరెక్టర్ బుచ్చిబాబు అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. అర్జున్ మాట్లాడుతూ 45 మూవీ లార్జర్ దన్ లైఫ్ మూవీ అని అన్నారు. ఈ సినిమాలో పాత్రలు సైతం అదే స్థాయిలో ఉంటాయని చెప్పుకొచ్చారు.
శివరాజ్ కుమార్ కీమో థెరపీలో ఉన్నా ఆయన యాక్షన్ సీన్లను కంప్లీట్ చేశారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో పాత్రకు ఉపేంద్ర మినహా ఎవరూ న్యాయం చేయలేరని అనిపించిందని ఆయన తెలిపారు. 45 రోజుల్లో ఏం జరిగిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని అందుకే ఈ టైటిల్ పెట్టామని వెల్లడించారు. జైలర్ సీక్వెల్ లో బాలయ్య నటిస్తున్నారో లేదో తెలియదని ఆయన తెలిపారు. బాలయ్య పర్సనల్ గా బాగా క్లోజ్ అని ఆయన వెల్లడించారు.