
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మనం చేసే పని ఏదైనా సరే 100% కష్టపడాలి అది షార్ట్ ఫిలిం అయినా సినిమా అయినా కూడా ఇదే చివరిదిగా అనే ఫీలింగ్ లో తీయాలని తెలిపారు.. తాను ఎక్కువగా బుక్స్ చదువుతానని సినిమాల కంటే పుస్తకాల పైన తనకు ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. మనం ఎప్పుడైనా సరే ప్రేక్షకులకు అర్థమయ్యేలా కథను రాయగలిగాలి ఒక సామాన్య కథను కూడా ఆసక్తి కలిగాక చూపించాలని తెలిపారు. యాంకర్ ఇలా అడుగుతూ కల్కి సినిమా తీస్తున్నప్పుడు ఒత్తిడి పెరిగిందా అని అడగగా..? కల్కి సినిమాలోని ప్రతి సన్నివేశం కోసం చాలా కష్టపడ్డాము అందుకే తెరపై చూశాక అది అద్భుతంగా వచ్చిందని తెలిపారు. కల్కి సినిమా వెనుక తన ఒక్కడి కష్టమే లేదని టీమ్ కూడా కష్టపడిందని అందరి సలహాలు కూడా తీసుకున్నామని తెలిపారు. చిన్నప్పటి నుంచి మహాభారతం గురించి తెలుసు దాని ఆధారంగానే సినిమా తీయాలని కొంత మేరకు భయపడ్డానని తెలిపారు.
ఇక ఎడిటింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని అడగగా..? నేను కొన్ని ప్రాజెక్టులకు ఎడిటర్ గా పని చేశానని.. సినిమాలకు ఎక్కువగా ఎడిటింగ్ ఏ ప్రధానమని తెలిపారు.
మీరు కథ రాసిన తర్వాత హీరోకి చెబుతారా? లేకపోతే హీరో కోసమే కథ రాస్తారా అని ప్రశ్నించగా?.. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. మొదట కథ అయితే రాసుకుంటాను అందులోని పాత్రల ఆధారంగానే నటీనటుల ఎంపిక చేస్తానని తెలిపారు. కల్కి సినిమాలోని పాత్రలు కూడా అలాగే సెట్ చేశానని కూడా తెలిపారు.
మీ కెరియర్ లో ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తే బాగుండు అనిపించే సినిమా ఏదైనా ఉందా అని అడగగా.. అందుకు ఖలేజా సినిమా, డియర్ కామ్రేడ్ సినిమాలను తాను ఎడిట్ చేసి ఉంటే బాగుండు అనిపించిందనీ తెలిపారు.