నాచురల్ స్టార్ నానిసినిమా చేసినా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.సరైన కథలను ఎంచుకుంటూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఈ హీరో తన సొంత బ్యానర్ లో కూడా కొన్ని సినిమాలు తీస్తూ నిర్మతగా కూడా రాణిస్తున్నారు. అలా నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో వచ్చిన అ!,హిట్, హిట్ ది సెకండ్ కేస్, కోర్టు వంటి సినిమాలు భారీ హిట్ కొట్టి కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయి. అలా నానిసినిమా చేసినా కూడా ఆయనకు కలిసి వస్తుంది. అయితే అలాంటి నాని 15 ఏళ్లుగా ఆ అమ్మాయిని కలవడం కోసం వైజాగ్ వెళ్లి వస్తున్నారట.మరి ఇంతకీ పెళ్లయిన నాని ఎవరిని కలవడానికి వైజాగ్ వెళుతున్నారు.. 15 ఏళ్ల నుండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారా..ఇంతకీ నాని చెప్పిన ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. నాని నిర్మాతగా చేసిన హిట్,హిట్ టు రెండు సినిమాల తర్వాత హిట్ త్రీ మూవీలో హీరోగా చేస్తున్నారు.

కేవలం హీరో గానే కాదు ఈ సినిమాకి ఆయనే నిర్మాత. అలా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న హిట్ త్రి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా కంటే ముందు వచ్చిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో హిట్ త్రీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మే 1న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సోమవారం అనగా ఏప్రిల్ 14న ఈ చిత్ర ట్రైలర్ ని వైజాగ్ లో గ్రాండ్గా లాంచ్ చేశారు మూవీ యూనిట్. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇదే విశాఖపట్టణానికి దాదాపు 15 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను. అది కూడా ఓ అమ్మాయి కోసం.

15 సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని కలవడానికి వైజాగ్ కి రావడం స్టార్ట్ చేశాను. అంటూ నాని చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో ఇంతకీ నాని భార్య అంజనాని పెట్టుకొని ఎవరిని కలవడానికి వచ్చారు అని చాలామందిలో ఒక అనుమానం అయితే నెలకొంది. కానీ నాని కలవడానికి వచ్చింది ఎవరినో కాదు ఆయన భార్య అంజనానే. అవును మీరు వినేది నిజమే.ఎందుకంటే ఈ విషయాన్ని నాని ఆ ఈవెంట్లో చెప్పారు. నేను 15 ఏళ్ల కిందట వైజాగ్ కి అమ్మాయిని కలవడానికి వచ్చాను.చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను అంటూ నాని తన భార్య అంజనాతో తన లవ్ బయటపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: