బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులరిటీని సొంతం చేసుకున్న వాళ్లలో ఆదిరెడ్డి ఒకరు. బిగ్ బాస్ షో టాప్5 కంటెస్టెంట్లలో ఆదిరెడ్డి ఒకరిగా నిలిచారు. తాజాగా ఆదిరెడ్డి ఎలాంటి సైకోలు ఉన్నారురా సమాజంలో అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రేమ పెళ్లి చేసుకుని నిండు గర్భిణిని హత్య చేసిన ఘటన గురించి బిగ్ బాస్ ఆదిరెడ్డి స్పందించారు.
 
రెండు ప్రాణాలను ఎలా చంపేశావంటూ ఆయన ఎమోషనల్ కావడం గమనార్హం. మరికొన్ని గంటల్లో డెలివరీ కాబోతున్న భార్యను గొంతు నులిమి చంపే కోపం ఎలా వస్తుందని ఆయాన అన్నారు. నిన్ను నమ్మి తన ఫ్యామిలీని వదిలేసి వస్తే ఇంత దారుణానికి ఒడిగట్టావంటే నువ్వెంత కసాయి నా కొడుకు అయ్యి ఉండాలని బిగ్ బాస్ ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ప్రేమించే సమయంలో 100సార్లు ఆలోచించాలని ఆయన తెలిపారు.
 
ప్రేమలో ఉన్నప్పుడు నటించడం అబ్బాయిలకు వెన్నతో పెట్టిన విద్య అని బిగ్ బాస్ ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసే తల్లీదండ్రులు సైతం పొరపాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. అబ్బాయి కొంచెం ఎర్రగా ఉండి డబ్బులు ఆస్తి ఉంటే చాలని పెళ్లిళ్లు చేసేస్తున్నారని ఆయన తెలిపారు. అబ్బాయి గుణన్ ఏంటో మాత్రం చూడట్లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
పెళ్లి చేసుకోబోయే వ్యక్తి సిబిల్ స్కోర్ వాడు మంచోడా కాదా అనే విషయాలను తెలుసుకోవాలని అలా చేయని పక్షంలో అమ్మాయి జీవితాన్ని మనమే నాశనం చేసిన వాళ్లమవుతామని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ఇలాంటి సైకోగాళ్లను ఉరి తీయాలని ఆదిరెడ్డి చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఆదిరెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఆదిరెడ్డి భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ఆదిరెడ్డి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి: