విజయ్ దేవరకొండకు ఆటిట్యూడ్ ఎక్కువ అని, చాలా పొగరుగా వ్యవహరిస్తారని, రెండు మూడు సినిమాల హిట్స్ కే ఆయన పెద్ద స్టార్లా ఫీల్ అవుతున్నాడని,ఇప్పటికే ఆయన గురించి చాలామంది ట్రోల్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ముఖ్యంగా ఆయన లైగర్ సినిమా విడుదల సమయంలో చూపించిన ఆటిట్యూడ్ చాలామందికి విసుగు పుట్టించింది. దాంతో సినిమా ప్లాఫ్ అవ్వడంతో సరైన గతే పట్టింది అన్నట్లుగా విజయ్ దేవరకొండని ట్రోల్ చేశారు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ పై తాజాగా బాలీవుడ్ జర్నలిస్ట్ విషం కక్కారు. విజయ్ దేవరకొండ పెద్ద హీరో ఏం కాదు..ఆయన్ని అంత గొప్పగా చేసి చూపించాల్సిన అక్కర్లేదు అంటూ ఆ జర్నలిస్టు మాట్లాడిన మాటలు విజయ్ దేవరకొండ అభిమానులకి రుచించడం లేదు. మరి ఇంతకీ ఆ బాలీవుడ్ జర్నలిస్టు ఎవరు..ఎందుకు విజయ్ దేవరకొండని టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. నటుడు విజయ్ దేవరకొండ సినిమాల్లో హీరోగా చేయకముందు రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. 

అలా నానితో హీరోగా చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో కీలకపాత్రలో చేసిన విజయ్ దేవరకొండ దశ.తిరిగిపోయింది. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాలో మొదటిసారి హీరోగా చేసి ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఈయన నటించిన ద్వారక అంత బాలేనప్పటికీ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా మాత్రం విజయ్ దేవరకొండని మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా చేసింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వల్ల విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ లైగర్ మూవీ సమయంలో ప్రవర్తించిన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు అంటూ బాలీవుడ్ జర్నలిస్ట్ హిమేష్ మన్కడ్ తీవ్ర విమర్శలు చేశారు.ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ విజయ్ దేవరకొండ పట్ల ప్రవర్తించిన తీరు చూసి నేను చాలా అప్సెట్ అయ్యాను. ఆయన ఏమి పెద్ద హీరో కాదు.

కానీ ఆయన ఓ బ్రాండ్ అన్నట్లుగా బాలీవుడ్ చేసి చూపిస్తుంది. బాలీవుడ్ ఆయన్ని సూపర్ స్టార్ ని చేసింది.కానీ టాలీవుడ్లోకి వెళ్తే ఆయన టైర్ -2 హీరో మాత్రమే. కానీ ఎందుకు ఆయన్ని అంతలా బాలీవుడ్ నెత్తిలో పెట్టుకుంటుందో అర్థం అవ్వడం లేదు అని విమర్శించాడు. అయితే ఆ పక్కనే ఉన్న మరో జర్నలిస్ట్ బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ఎలాగో టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అలా అని అనడంతో అలాంటిదేమీ లేదు.. విజయ్ దేవరకొండ ఫ్లాప్ సినిమా లైగర్ ఫుల్ రన్ లో 20 కోట్లు కూడా రాబట్టట్లేదు.కానీ సల్మాన్ ఖాన్ ఫ్లాప్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు రాబడుతుంది.ఆయనతో ఈయనకు పోలిక ఏంటి అన్నట్లుగా జర్నలిస్టు హిమేష్ విజయ్ దేవరకొండ ను విమర్శించారు. అంతేకాదు విజయ్ 12 సినిమాలు చేస్తే అందులో మూడు మాత్రమే హిట్లు ఉన్నాయి మిగతావన్నీ ప్లాఫ్సే అంటూ అవమానించారు. ప్రస్తుతం బాలీవుడ్ జర్నలిస్టు హిమేష్ మన్కడ్ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: