
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2. అఖండ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2 పై టాలీవుడ్ లో అంచనాలు అయితే మామూలుగా లేవు. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కు సీక్వెల్ గా వస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు దుమ్ము లేపేస్తున్నాయి. అఖండ 2 పై ఇప్పటికే ఉన్న బజ్ మరింత డబుల్ చేస్తూ ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను మరింత కేర్ తీసుకుంటూ స్క్రిప్ట్ పై మరింతగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ కి ఒక సెపరేట్ ట్రాక్ రికార్డు ఉంటుందన్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను యాక్షన్ అంటే సుమోలో గాల్లోకి ఎగురుతాయి .. దుమ్ము రేగుతుంది.. యాక్షన్ అంతా హై ఓల్టేజ్ గా ఉంటుంది. ఇక బోయపాటి తాను డైరెక్ట్ చేసే ప్రతీ సినిమాకి కూడా కొత్త కొత్త యాక్షన్ ఎపిసోడ్స్ తాను డిజైన్ చేయించుకుంటారు. ఇలా అఖండ 2 యాక్షన్ సీక్వెన్స్ లపై కూడా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఫైట్ మాస్టర్లు పని చేస్తున్నారట.
రామ్ లక్ష్మణ్ సోదరులు అలాగే పీటర్ హెయిన్ సహా మరో ప్రముఖ స్టంట్ మాస్టర్ రవి వర్మలు అఖండ 2 లో యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారట. వీరి లో రవి వర్మతో బోయపాటి మరింత స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గతంలో సరైనోడు లో కూడా రవివర్మ సాలిడ్ వర్క్ అందించగా .. ఇప్పుడు రామ్ చరణ్ తో ధృవ సినిమాకి కూడా తాను వర్క్ చేశారు. సో ఇలా అఖండ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తుంటే గూస్ బంప్స్ మోత మోగిపోతోందట.