రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం కాస్త ఆలస్యమైనప్పటికీ మంచి స్టోరీతో రాజమౌళి తెరకెక్కిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి శరవేగంగా జరుపుతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. 

షూటింగ్ లో కనీసం చిన్న సన్నివేశం కూడా బయటికి రాలేదు. షూటింగ్ కి సంబంధించి ఎలాంటి సన్నివేశాలు లీక్ కాకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఫోన్స్ కూడా షూటింగ్ లోకి అలో చేయడం లేదట. దీంతో మహేష్ బాబు అభిమానులు కాస్తా నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎస్ఎస్ఎంబి 29 సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. మహేష్ బాబు అభిమానుల సంతోషం కోసం ఎస్ఎస్ఎంబి 29 సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

స్టన్నింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని ఇది పూర్తయిన వెంటనే గ్లింప్స్ కు సంబంధించి అనౌన్స్మెంట్ చేస్తారని సినీవర్గాలు వెల్లడించాయి . త్వరలోనే దీనికి సంబంధించి మరింత సమాచారం బయటకు రానుంది. కాగా, రాజమౌళి ఇదివరకే తెరకెక్కించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోగా ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.


కాగా ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. కాగా, ఈ సినిమా 2027 మార్చి 25 లేదా 27వ తేదీన రిలీజ్ చేయాలని మేక ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అందుకుంటున్న చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: