టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది సింగర్లు ఉన్నారు. అలాంటి వారిలో సింగర్ దామిని భట్ల ఒకరు. తెలుగు సినీ ప్రియులకు పరిచయం అక్కలేని పేరు. దామిని తెలుగులో అనేక సినిమాలలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు అందుకుంది. అంతేకాకుండా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేయడం విశేషం. ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో మంచి మంచి పాటలు పాడి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన మధురమైన స్వరంతో తన అంద చందాలతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో దామిని ఉన్నది తక్కువ రోజులే అయినప్పటికీ తన ఆట తీరుతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక దామిని భట్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఫోటోతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ చేస్తూనే ఉంటుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు కొంతమంది పాజిటివ్ గా స్పందించగా... మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. అలాంటి వారికి దామిని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. ఈ చిన్నది సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తుంది. అంతేకాకుండా దామినికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాని ద్వారా కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటుంది. ఇక దామిని తన కుటుంబ సభ్యులతో కాకుండా సింగిల్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని ఓ ప్రముఖ ఛానల్ కు దామిని ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో స్పందించారు. ఇక దామిని సింగిల్ గా ఉండడానికి గల కారణాలు చెబుతూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు కొద్ది రోజుల క్రితమే నాకు, మా అక్కకు, అమ్మానాన్నలకు కలిపి సపరేట్ గా బెడ్ రూమ్స్ ఉండేవి. అప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది అని దామిని అన్నారు. ఇక ఆ సమయంలో సింగిల్ గా లైఫ్ ఎలా కొనసాగించాలో తెలుసుకోవాలని అనుకున్నానని దామిని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో వారితో నేను సింగిల్ గానే ఉంటాను.

ఖర్చులు అన్నింటిని నేనే భరిస్తానని చెప్పినట్లుగా దామిని అన్నారు. నేనే ఒక్కదాన్ని వంట చేసుకుని తింటాను అని కూడా తన తల్లిదండ్రులతో చెప్పి దామిని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సపరేట్ గా ఇల్లు తీసుకుని తానే సింగిల్ గా తన లైఫ్ సంతోషంగా కొనసాగిస్తోంది. ఒక అమ్మాయి సింగిల్ గా ఇలా ఎదగడం చాలా మంచి విషయం అంటూ దానిని మాట్లాడారు. ప్రస్తుతం దామిని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: