గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా ... కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్మూవీ లో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఈ మూవీ యూనిట్ ఒక గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ మూవీ నుండి ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన గ్లీమ్స్ వీడియో అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఒక్క సారిగా అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో రామ్ చరణ్ పోర్షన్ కు సంబంధించిన షూటింగ్ ఆగస్టు చివరి నాటికి పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ హైదరాబాదులో వేసిన రైల్వే స్టేషన్ సెట్ లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రైల్వే స్టేషన్ సెట్లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వే స్టేషన్స్ సెట్ లో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా నిలబబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: