సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు పొందిన హీరోయిన్. ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి 'ఏం మాయ చేశావే' అనే చిత్రం ద్వారా పరిచయమైంది. సినిమా అంతగా గుర్తింపు నివ్వలేదు కానీ మహేష్ బాబుతో దూకుడు సినిమా చేసి అద్భుతమైన హిట్ సాధించింది. ఆ తర్వాత సమంత గురించి ఇండస్ట్రీ అంతా తెలిసిపోయింది. అలా వరుసగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో ఆమె జత కట్టింది. దాదాపుగా దశాబ్ద కాలానికి పైగా  ఇండస్ట్రీ లో రానించి స్టార్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఈమె కెరియర్ మంచి పొజిషన్ లో ఉండగానే  అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు వీరు హ్యాపీగా జీవించి  అన్ ఎక్స్పెక్టెడ్ గా విడాకులు తీసుకొని దూరమయ్యారు.

 అసలు వీరి విడాకుల కారణమేంటన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి  అద్భుతమైన కథలెంచుకుంటూ దూసుకుపోతోంది. అలాంటి సమంత  తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తనకి ఎంతో ఇష్టమైన వ్యక్తుల గురించి బయట పెట్టింది.. ఈ ఇంటర్వ్యూ లో  యాంకర్ మూడు చాక్లెట్స్ ఇచ్చారు. ఈ మూడు చాక్లెట్లు మీరు ఎవరెవరికి ఇస్తారని, అడగ్గా నాకిష్టమైన వాళ్లకి ఇస్తానని చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా మొదటి చాక్లెట్స్ ను తనకు సినిమాల్లో తొలి అవకాశం ఇచ్చినటువంటి గౌతమ్ వాసుదేవ్ మీనాన్ కి ఇస్తానని అన్నది. ఆ తర్వాత రెండో చాక్లెట్  తన అదృష్ట హీరో విజయ్ కి ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత మూడవ చాక్లెట్  తనకు ఎంతో ఇష్టమైన  డైరెక్టర్ అట్లీ కి ఇస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు తెలుగు నుంచి కనీసం నాగచైతన్య ని కూడా ఎంపిక చేయలేదని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: