వెంకటేష్ - ఎన్టీఆర్ కాంబోలో సినిమానా..? వారెవా అదిరిపోయి ఉండేదిగా.. ఎందుకు మిస్సయింది . ఇద్దరు స్టార్సే . ఇద్దరూ మంచి క్లోజ్ గా ఉండే పర్సన్స్ . మరి ఎందుకు ఆ మూవీ క్యాన్సిల్ అయ్యింది. ప్రెసెంట్ ఈ న్యూస్  సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . జూనియర్ ఎన్టీఆర్ సైతం అలాంటి ఒక స్టార్ స్టేటస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . ఇద్దరు కూడా చాలా చాలా నాటి . ఇద్దరు కూడా హోమ్లీ పాత్రలకు బాగా సెట్ అవుతారు.


మరి అలాంటి ఇద్దరు స్టార్స్ ని కలిపి ఒక సినిమాలో చూపించాలి అనుకున్నాడు డైరెక్టర్ . కానీ ఇద్దరు హీరోలు కూడా ఆ స్టోరీని రిజెక్ట్ చేశారు . ఆ మూవీ మరేంటో కాదు ఊపిరి . నాగార్జున హీరోగా కార్తీక్ మరో హీరోగా తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . అయితే నిజానికి డైరెక్టర్ ఈ సినిమాలో ముందుగా నాగార్జున ప్లేస్ లో వెంకటేష్ ..కార్తీ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నారట . కానీ ఇద్దరు కూడా ఈ కాన్సెప్ట్ ను రిజెక్ట్ చేశారట. రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు చెప్పి చెప్పగానే అటు జూనియర్ ఎన్టీఆర్.. ఇటు వెంకటేష్ రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ సెకండ్ ఆప్షన్ కింద చాలా మంది హీరోస్ తో ఈ కథను చేయాలి అంటూ అప్రోచ్ అయ్యారట.



ఫైనల్లీ ఆ అదృష్టం నాగార్జున - కార్తీక్ లకి దక్కింది.  ఏ మాటకు ఆ మాట కార్తీ సినిమాలో పర్ఫార్మ్ చేసినట్లు మరి ఏ హీరో కూడా పెర్ఫార్మ్ చేయలేడు అన్నది మాత్రం వాస్తవం . ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చిన సరే చాలా ఫన్నీగా ఆకట్టుకుంటూ ఉంటుంది . కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తారు ఈ ఫిలిం.  అలాంటి ఫిలిం ఎందుకు  ఎన్టీఆర్ - వెంకటేష్ వద్దన్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రసెంట్ తారక్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ గా మారిపోయాడు. వెంకటేష్ కూడా పలు సినిమాలతో బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నాడూ..!

మరింత సమాచారం తెలుసుకోండి: