శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "45". ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా "45" సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ - మా 45 మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మేమంతా ఇష్టపడి, కష్టపడి చేశాం. మీ సపోర్ట్ మా మూవీకి కావాలి. ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి అన్నారు.

దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ - 45 మూవీని శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో చేయడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు నువ్వే డైరెక్షన్ చేయి అని ఎంకరేజ్ చేశారు. ఆయన మాటతోనే ఈ సినిమాకు దర్శకత్వం చేసే కాన్ఫిడెన్స్ వచ్చింది. శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకున్నా, ఎంతో సపోర్ట్ చేసి సినిమాలో నటించారు. ఉపేంద్ర గారిని ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు అన్నారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ - 45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్ గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన  ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు దర్శకుడు అర్జున్ జన్యా అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

45