
హిట్ 3 : నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 21.36 మిలియన్ వ్యూస్ దక్కాయి.
లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 16.80 మిలియన్ న్యూస్ ను సాధించింది.
స్కంద : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల సమయంలో 13.20 మిలియన్ వ్యూస్ దక్కాయి.
మాచర్ల నియోజకవర్గం : నితిన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కు విడుదల 24 గంటల సమయంలో 13.11 మిలియన్ వ్యూస్ దక్కాయి.
బింబిసారా : కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కు 24 గంటల్లో 12.30 మిలియన్ వ్యూస్ దక్కాయి.
రాబిన్ హుడ్ : నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 11.09 మిలియన్ వ్యూస్ దక్కాయి.
ఏజెంట్ : అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల 10.54 మిలియన్ వ్యూస్ దక్కాయి.