
అయితే ఇప్పుడు మాత్రం నయనతార ఓ విషయం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . నయనతార సర్జరీ చేయించుకోబోతుందట . అది కూడా తన షోల్డర్ కి . ఆమెకు కర్తవ్యం సినిమా చేసే మూమెంట్ లోనే షోల్డర్ కి చిన్న గాయమైందట . అప్పటి నుంచి ఆ గాయాన్ని తగ్గించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తూనే వస్తుందట . షోల్డర్ లో చిన్న పాటి మైనర్ సర్జరీ చేయాలి అంటూ ఎప్పుడో డాక్టర్ లు సజెస్ట్ చేశారట . ఇన్నాళ్లు ఆలస్యం చేస్తూ వచ్చిన నయనతార ఇప్పుడు దానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
నయనతార షోల్డర్ కి సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. ఇదే న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ హైలెట్గా మారింది. ఒకవేళ నయనతార సర్జరీ చేయించుకుంటే దాదాపు నాలుగు నెలల పాటు రెస్ట్ అవసరమని ..ఆమె కమిట్ అయిన ఆ సినిమాలు అన్నీ కూడా హోల్డ్ లో పడినట్టే అని మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో నయనతార సర్జరీకి సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ గా మారింది . అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం క్లారిటీ రావడం లేదు . నయనతార దగ్గర నుంచి కానీ నయనతార టీం దగ్గర నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే లేదు . సాధారణంగా ఇలాంటి ఆపరేషన్ కు సంబంధించి చిత్ర స్టార్స్ ఎవరూ కూడా బయటపెట్టారు. బహుశా నయనతార కూడా ఆ కారణంగానే సైలెంట్ గా ఉండిపోయింది అంటున్నారు జనాలు..!