
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సానా కాంబో లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది .. ఈ సినిమా పై ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ అంచనాలై తే ఉన్నాయి .. అలాగే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఊహించని రేంజ్ లో ఎదురు చూస్తున్నారు .. ఇక పెద్ది సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ తో మరో భారీ సినిమా రామ్ చరణ్ లైనప్ లో కూడా ఉంది .. అయితే ఇలా ఉన్నా కొన్ని సినిమా లే అయినా రామ్ చరణ్ లైనప్ పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇంపాక్ట్ సెట్ చేసే లైనప్ తోనే ఉండటం ఇక్కడ మరో విశేషం ..
అయితే వీటి తో పాటు గా మరో సెన్సేషనల్ కాంబో ఇప్పుడు సెట్ కాబోతుంది అన్నట్టు గా రూమర్లు వస్తున్నాయి .. ఇక మరి ఆ దర్శకుడు మరి ఎవరంటే సందీప్ రెడ్డి వంగ .. ఇక గత కొన్నాళ్ల క్రితం వీరి కాంబో పై టాక్ కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఈ కాంబో దాదాపు నిజం కాబోతుంద ని తెలుస్తుంది .. దీని తో ఈ సెన్సేషన్ కలయిక జరగబోతుంది అని అనుకోవచ్చు .. ఇక మరి దీని పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది .. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయడాని కి రెడీ అవుతున్నాడు .. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు అనేది ఇన్సైడ్ వర్గాల టాక్ .. ఇక మరి త్వరలో నే దీని పై కూడా క్లారిటీ రానుంది .