
డూప్ కూడా నటించమన్నా నటిస్తాడు. సినిమా కోసం ఏదైనా చేసేస్తాడు . కాగా జూనియర్ ఎన్టీఆర్ గతంలో ఆయన సినిమాల కోసం ఇలాగే ఎన్నెన్నో రిస్క్లు చేసిన సందర్భాలు ఉన్నాయి . అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్..ప్రశాంత్ నీల్ సినిమా కోసం బాగా బరువు తగ్గిపోయాడు. చాలా చాలా స్లిమ్ లుక్స్ లో కనిపిస్తున్నారు . రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన లుక్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ స్లిమ్ లుక్స్ వెనకే ఒక జబ్బు దాగుంది అంటూ సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రారంభించారు ఎవరో కొందరు తారక్ కంటే పడని వాళ్ళు .
తారక్ కి ఏదో జబ్బు ఉందని.. అందుకే ఈ విధంగా సడన్గా బరువు తగ్గిపోయాడు అని మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ గా దాని పై ఓ క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రామ్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురవ్వగా జూనియర్ ఎన్టీఆర్ లావు తగ్గడం గురించి కళ్యాణ్ రామ్ ఓపెన్ గా స్పందించాడు . జూనియర్ ఎన్టీఆర్ తనసినిమాల కోసం ఏమైనా చేస్తాడు అని ఆయనకు ట్రైనింగ్ నేను ఇవ్వలేదు అని.. జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల కోసమే బరువు తగ్గుతున్నాడు అన్న విషయాన్ని ఓపెన్ గానే క్లారిటీగా పరోక్షంగా చెప్పేసాడు. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది.