
అడ్వాన్సులు అన్నీ బయర్లు దగ్గర ఇరుక్కుపోయాయి .. ఇక దాంతో కొత్త సినిమాలకు డబ్బులు ఇవ్వటం అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లేదు .. ప్రస్తుతం ఎగ్జిబిటర్ల డబ్బులే బయ్యార్ల దగ్గర ఉన్నాయి దీని కారణంగా ఇప్పుడు ఈ వారం , వచ్చేవారం విడుదలయ్యే సినిమాలకు డబ్బులు కట్టాలంటే బయ్యర్లు కింద మీద పడాల్సిన పరిస్థితి .. దీని కారణంగా డబ్బులు కట్టలేక చేతులు ఎత్తేయడం లేదా సినిమా పంపిణీ చేయగలం తప్ప మరేమీ చేయలేమని చెప్పటం జరుగుతుంది .. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ అయింది జనవరిలో .. కానీ గేమ్ చేజంర్ కు కట్టిన డబ్బులకు అవి సరిపోయాయి .. ఇక తర్వాత రాబిన్ హూడ్ , దిల్ రూబ, లైలా, మజాకా, జాక్ ఇలా వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేదు .. ప్రధానంగా రాబన్ హుడ్ , జాక్ సినిమాలకు కాస్త పెద్ద మొత్తంలో కట్టాల్సి వచ్చింది ..
ఇక ఇప్పుడు ఈ వారంలో రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి .. ఆ తర్వాత వారంలో ఒక సినిమా రాబోతుంది .. అలా చివరిలో హిట్ 3 ఉంది .. ఆ సినిమా వరకు ఒకే కానీ ఈ లోపల వచ్చే సినిమాలకు డబ్బులు కట్టడం అంటే అటు ఇటు చూస్తున్నారు బయ్యర్లు . ఓవర్సీస్ బయ్య ర్ ఇటీవల రెండు మూడు సినిమాలుకు కలిపి రెండు మిలియాలకు పైగా వసూలు తెచ్చుకోవాలి .. కానీ ఒకటిన్నర మిలియన్ కూడా రాలేదు . ఇక దాంతో చిన్న మిండ్ రేంజ్ సినిమాలపై అసలు ఆసక్తి చూపించడం లేదు .. ఇక ఇప్పుడు హిట్ 3 అన్నది లేటెస్ట్ అట్రాక్షన్ ఇది హిట్ అయితే ఓకే .. ఎందుకంటే ఈ సమ్మర్ లో వస్తున్న క్రేజీ సినిమాల్లో ఇది కూడా ఒకటి .. దీని కారణంగా అందరూ డబ్బులు పెడతారు .. కానీ అది తేడా చేస్తే ఈ ప్రభావం మొత్తం సమ్మర్ మీద పడిపోతుంది .. అలాగే దీని తర్వాత వచ్చే కింగ్డమ్ మరేదైనా కావచ్చు గట్టి దెబ్బే ఉంటుంది .