టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన కెరియర్లో ఎన్నో ప్లాప్ లు ఇచ్చి ఉండొచ్చు .. కానీ ఇప్పటికీ ఆయనకు ఉండాల్సిన క్రేజ్ ఆయనకు అలానే ఉంది .. అందుకే ఇప్పుడు తాజా విజయ్ సేతుపతి ఆయనకు సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చారు .  అలానే త్వరలోనే ఈ సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నారు .  బెగ్గర్ అనేది ఈ మూవీ టైటిల్ అని వార్తలు వస్తున్నాయి .  ఈ మూవీలో సీనియర్ బ్యూటీ టబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు .. అయితే ఇప్పుడు ఇదిలా ఉండగానే మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ..  


హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న ఫహాద్‌ ఫాజిల్ కూడా పూరి తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది .. అయితే ఫాజిల్ హీరోగా సినిమా చేస్తారా ? లేదా ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తూ మరో హీరోతో ఉండే సినిమాలో నటిస్తారా ? అసలు దేనికోసం ఫహాద్‌ ఫాజిల్ పూరికి డేట్లు ఇచ్చారు అన్నది ఎప్పుడు పెద్ద క్యూస్షన్ గా మారింది . పూరి జగన్నాథ్ తో ఓ సినిమా చేయడానికి ఫహాద్‌ ఫాజిల్ ఓకే అన్నారు అన్నది మాత్రం పక్కగా తెలుస్తున్న విషయం .. ప్రస్తుతం ఫహాద్‌ ఫాజిల్ చేతిలో నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి .. ఇక వాటిలో పూరితో చేసేది కూడా ఒకటి ..


ఇక రెండోది ఇటీవల వచ్చిన సత్యం సుందరం దర్శకుడుతో మరొకటి .. అలానే మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి . ఇక వీటిలో పూరి సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది ఎవరికీ తెలీదు .. అలానే విజయ్ సేతుపతి సినిమా అయిన తర్వాతే పూరిసినిమా అయినా మొదలుపెట్టేది . ఇక ఫహాద్‌ ఫాజిల్ ఓకే అన్న వరకు అంతా బానే ఉంది .. అలానే విజయ్ సేతుపతితో సినిమా హిట్ అయితేనే ఫహాద్‌ ఫాజిల్ సినిమా ముందుకు వెళుతుంది అనేదాంట్లో కూడా వాస్తవం ఉంది .  ఇక మరి విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వస్తాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: