ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే .. ఇక వాటిలో దర్శకుడు సుజిత్ తో చేస్తున్న ఓజి .. ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కూడా ఒకటి .. పవన్ కళ్యాణ్ చేస్తున్న పక్క మాస్ యాక్షన్ కమర్షియల్ మాఫియా సినిమా కావటంతో ఈ సినిమాపై అభిమానులు ఎప్పటినుంచో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు .  అయితే గత కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా నుంచి వచ్చే మొదటి సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉంది .. కానీ పలు అనుకొని కారణాల వల్ల  వాయిదా పడుతూ వచ్చింది .. అయితే ఇప్పుడు ఆ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై సంగీత దర్శకుడు తమన్ సాలిడ్ అప్డేట్ అయితే అందించారు ..


ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఆరోజు అభిమానులకు గిఫ్టుగా అయితే మొదటి పాటను ‘ఫైర్ స్ట్రాం’ని విడుదల చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు .. అలాగే ఈ సాంగ్ నే తమిళ హీరో శింబు పడటం జరిగింది .  అయితే ఇప్పుడు ఆ రోజు కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .  ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసింది .. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ తో పాటు హరిహర వీరమల్లులో కూడా నటిస్తున్నారు .. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు మే 9న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది ..


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో చివర దూసుకు వచ్చింది .. మరో నాలుగు రోజుల పవన్ కళ్యాణ్ షూటింగ్  మినహా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది ..  మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొని మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తారని కూడా తెలుస్తుంది .. అలానే సమ్మర్ తర్వాత ఓజి సినిమా షూటింగ్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ అడుగు పెడతారని తెలుస్తుంది .. 2025 చివరలో అనగా నవంబర్ లేదా డిసెంబర్లో ఓజిని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి డివివి ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతుంది .. మరి దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: