తాజాగా నాని "హిట్ ది థర్డ్ కేస్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కానీ ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో వచ్చిన లైక్స్ విషయంలో మాత్రం లైగర్ మూవీ రికార్డును క్రాస్ చేయలేకపోయింది.

కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ "లైగర్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అనన్య పాండే హీరోయిన్గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్కు విడుదల అయిన 24 గంటల్లో 561 కే లైక్స్ లభించాయి. మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలలో ఇప్పటి వరకు విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన సినిమా ట్రైలర్లలో లైగర్ మూవీ ట్రైలర్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే తాజాగా నాని హీరోగా రూపొందిన హిట్ 3 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల 24 గంటల సమయంలో 422.4 కే లైక్ లభించాయి. దానితో ఈ మూవీ మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమా ట్రైలర్లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన ట్రైలర్ల లిస్టులో ఈ మూవీ ట్రైలర్ రెండవ స్థానంలో నిలిచింది. ఇకపోతే హిట్ 3 మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ... శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని నాని స్వయంగా నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: