
వెంకటేష్ సూపర్ హిట్ మూవీ’సుందరాకాండ’ టైటిల్ ను ఈమూవీకి పెట్టడంతో ఈ మూవీ పై ఆశక్తి పెరిగింది. వాస్తవానికి ఈసినిమా గత సంవత్సరం విడుదల కావలసి ఉన్నప్పటికీ రకరకాల కారణాలతో ఈ మూవీ విడుదల వాయిదా పడిపోతూ వచ్చింది. ఆతరువాత ఈమూవీని ఈ సమ్మర్ సీజన్ లో విడుదల చేస్తారు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమూవీకి సంబంధించిన వార్తలు ఏమీ రాకపోవడంతో ఈ మూవీ ఈ సమ్మర్ సీజన్ లో కూడ విడుదల కాకపోవచ్చు అని అంటున్నారు.
ప్రభాస్ మొట్టమొదటి సినిమా ‘ఈశ్వర్’ లో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి విజయ్ కుమార్ ఈ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈకామెడీ ఎంటర్ టైనర్ కు లియోన్ జేమ్స్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈసినిమా నిర్మాణం పూర్తి అయి విడుదలకాకపోవడానికి ఈమూవీకి సంబంధించిన బిజినెస్ డీల్స్ ఓటీటీ డీల్స్ పూర్తి అవ్వకపోవడమే అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.
చాలా ఆలస్యంగా మొదలైన నారా రోహిత్ మరో సినిమా ‘భైరవం’ మాత్రం తన నిర్మాణం పూర్తి చేసుకోవడంతో ఆసినిమాను విడుదల చేయడానికి ఆ సినిమా నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలు తీయడం ఒక సమస్య అయితే ఆసినిమాలను కొనడానికి బయ్యర్లు అదేవిధంగా ఓటీటీ సంస్థలు ముందుకురాని పరిస్థితులలో నారా రోహిత్ లాంటి హీరోలు నటించిన సినిమాలు విడుదల అవ్వడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నారా రోహిత్ సినిమాలు ఈకష్టాలను అధికమించి ఎప్పుడు విడుదల అవుతాయి అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..