ఏదైనా విజయం సాధిస్తే దానికి వందమంది తండ్రులు ..  అదే ఓటమి మాత్రం ఎవరికీ పట్టని అనాధ  .. సినిమా విషయంలో కూడా ఇంతే   .. ఏదైన మూవీ హిట్ అయితే మాత్రం ఈ క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ముందుకు వస్తారు .. అదే ఫ్లాప్ అయితే మాత్రం ఎవరి దారి వారు చూసుకుంటూ పక్కకు వెళ్లి పోతారు .  ప్రస్తుతం కొన్ని ప్లాప్‌లు ఇండస్ట్రీని ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నాయి .. ప్లాప్‌లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు వెంట నిర్మాత హీరో వంట పడటం ఎంతో కామన్ .. ఈసారి కూడా అదే జరుగుతుంది .


ప్రస్తుతం తెలుగు ఫిలిం చాంబర్ లో ఆరడజను సినిమాలకు సంబంధించిన పంచాయతీలు జరుగుతున్నాయి .  డిస్ట్రిబ్యూటర్లో మేము మీ సినిమాను కొన్ని నష్టపోయాం .. ఎంతో కొంత వెనక్కి ఇవ్వాల్సిందే అంటూ నిర్మాతలపై కంప్లైంట్ చేస్తే .. సదరు నిర్మాత హీరోని నమ్మి సినిమా తీసాం .. భారీగా రెరెమ్యున‌రేష‌న్ కూడా ఇచ్చాం ఇప్పుడు నష్టాలు వస్తే హీరోదే బాధ్యత కాదా .. హీరో రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వాలి అని ఆ హీరోలపై ఫిర్యాదు చేశారు .. ఇక ప్రస్తుతం ఈ పంచాయతీలే టాలీవుడ్ లో గట్టిగా నడుస్తున్నాయి . రీసెంట్ గా ఓ మీడియం రేంజ్‌ సినిమా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది . సదరు హీరోకి 12 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చారు ..


ఇక నిజానికి ఆ సినిమా ఓకే చేసేముందు ఆ హీరోకి అంత క్రేజ్‌ కూడా లేదు .. తన లేటెస్ట్ సినిమా హిట్ అయిందని చెప్పి .. రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేశాడు . హీరో క్రేజ్‌ని క్యాష్ చేసుకొనే ఉద్దేశంతో నిర్మాత కూడా అడిగినంత ఇచ్చేశాడు .. ఇక సినిమా కూడా భారీగానే తీశాడు .. అయితే కనీసం రిలీజ్ తర్వాత ఓపెనింగ్స్ కూడా రాలేదు .. ఇలా రూపాయికి రూపాయి నిర్మాత దివాలా తీసినట్టయింది .. అందుకే ఇప్పుడు అంతా ఆ హీరో మీద పడ్డారు .. నిన్ను నమ్మే కదా ఇంత పెట్టుబడి పెట్టింది .. ఇప్పుడు ఎంతోకంత వెనక్కి ఇవ్వాల్సిందే అంటూ పంచాయతీకి వచ్చారు .. ఇక హీరో మాత్రం దీనిపై ఎక్కడా స్పందించడం లేదు .. ఫిలిం ఛాంబర్ లో నడిచే పంచాయతీల్లో ఎక్కువ శాతం యంగ్ హీరోల పైనే .. అయితే ఇప్పుడు వీటి పై  చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలంతా కలిసి ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది .

మరింత సమాచారం తెలుసుకోండి: