సినీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు ఆరోపణల సైతం వస్తూ ఉంటాయి. కొంతమంది యాక్టర్స్ వల్ల చాలామంది నటీనటులు కూడా ఇబ్బంది పడ్డామని చెప్పిన సందర్భాలు చాలానే విన్నాము. కాకపోతే ఎవరో ఒకరు వాటిని బయట పెడితే కానీ అసలు నిజం ఏంటన్నది తెలియదు. ఇప్పుడు తాజాగా మలయాళ ఇండస్ట్రీలో నుంచి ఒకనటి తనతో ఒక హీరో డ్రగ్స్ తీసుకొని మరి షూటింగ్లో పాల్గొన్నారని విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఈ విషయం మరొకసారి మలయాళ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారుతున్నది.


మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ విన్సీ సోని ఈమధ్య తాను నటిస్తున్నటువంటి ఒక సినిమా షూటింగ్ సెట్లోకి వెళ్ళినప్పుడు తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని సైతం బయటపెట్టింది. ఒక అగ్ర హీరో తనని ఇబ్బంది పెట్టారంటు స్వయంగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని సైతం షేర్ చేసింది. ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో తన డ్రెస్ కాస్త ఇబ్బందిగా అనిపించిందని ఈ విషయాన్ని ఆ సినిమా హీరో తనతో చెప్పారని.. సరే అని మార్చుకుందామని క్యారవ్యాన్ వైపు వెళుతూ ఉండగా ఆ హీరో కూడా తనతో వస్తానని అందరి ముందు చెప్పారని వెల్లడించింది. అయితే ఆ హీరో పేరు మాత్రం చెప్పలేదు.


అలాగే మరొక సీన్ చేస్తున్న సమయంలో ఆ హీరో నోటి నుంచి ఒక తెల్లని పదార్థం అనుకోకుండా బయటపడింది. అయితే అది డ్రగ్స్ కాక ఇంకేం అయ్యి  ఉంటుంది.. ఆ డ్రగ్స్ అలవాటు ఉన్నవారితో నటించకూడదని నిర్ణయం అప్పటి నుంచే తీసుకున్నారని తెలిపింది. ఆరోజు సినిమా షూటింగ్ షేట్లో అసభ్యకరమైన అనుభవం తనకు ఎదురయ్యిందంటూ ఒక వీడియో ద్వారా తెలిపింది. మొదట 2019లో వికృతి అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా మారింది విన్సీ సోని.. ఆ తర్వాత జనగణమన, రేఖ, పద్మిని, తదితర సినిమాలలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: