సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టండి .. అసలు వ్యక్తిగతంగా వేరే రంగాలలో కూడా కుళ్ళు.. ఈర్హ్య.. స్వార్థం..ద్వేషం  లేని వాళ్ళు ఉంటారా..? ఎవరికైనా ఉంటుంది . మనిషి పుట్టుక పుట్టాక కచ్చితంగా కొంచెం స్వార్థం కొంచెం జలసి ఇలాంటివి ఉండనే ఉంటాయి . అయితే మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి జలసీలు స్వార్థాలు కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో దొబ్బేయడం ఒక హీరో పైకి ఎదుగుతుంటే మరొక హీరో తొక్కేయడం .. ఒక హీరోయిన్ పైకి ఎదుగుతుంటే మరొక హీరోయిన్ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడం ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి.


అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ ఉన్నారు. చాలామందికి తామే నెంబర్ వన్ గా ఉండాలి అనే స్వార్థం ఉంది.  పక్క హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తే ఆ హీరోలకి మించిన స్థాయిలో సినిమాలు చేయాలి అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో ఇద్దరే ఇద్దరు హీరోలు మాత్రం కాంట్రవర్షియల్ కి ..కుళ్లు కి.. జలసికి.. ఈర్ష్య కి అన్నిటికి దూరంగా ఉంటారు..తమ పని తాము చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.  పక్క వాళ్ళతో అసలు సంబంధమే లేదు అనుకుంటూ ఉంటారు.



ఆ ఇద్దరు మరెవరో కాదు ప్రభాస్ - మహేష్ బాబు . సోషల్ మీడియాలో ఒక్కటంటే ఒక్క నెగిటివిటీ లేని హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చెప్పుకునే రెండే రెండు పేర్లు ప్రభాస్ - మహేష్ బాబు . తమ సినిమా షూటింగ్ చేసుకున్నామా.. పేమెంట్ తీసుకున్నామా.. నెక్స్ట్ సినిమా షెడ్యూల్ ఫైనలైజ్ చేసుకున్నామా.. ఇంతే ఇండస్ట్రీలో కాంట్రవర్షియల్ విషయాలలో తల దూర్చరు.. క్యాస్టింగ్ కౌచ్ - రెమ్యూనరేషన్.. హై - లో ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. అసలు కాంట్రవర్షియల్ కంటెంట్  ఉన్న సబ్జెక్టుని ఇప్పటివరకు వీళ్లు చేయలేదు. అంత పకడ్బందీగా కెరియర్ ని ప్లాన్ చేసుకున్నారు మహేష్  - రెబల్ స్టార్ ప్రభాస్. అయితే ఇద్దరు ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు. ఈ ఇద్దరికీ ఇద్దరే సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు . అయితే వీళ్ళల్లో కూడా స్వార్థం అంత ఇంతో ఉంటుంది . కానీ అది బయటపడడం లేదు అంతే.  అది వ్యక్తిగత స్వార్థం కన్నా కూడా ఫ్యామిలీ స్వార్ధం అని చెప్పుకోవాలి అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: