
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో కూడా అర్థం కావడం లేదు. పుష్ప 2 సినిమా తర్వాత బన్నీ స్కేల్ బాగా పెరిగి పోయింది. అందుకే ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడం కంటే తమిళ దర్శకుడు అట్లీ ప్రాజెక్టు కు కమిట్ అయ్యేందుకు ఎక్కువ ఆసక్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ త్రివిక్రమ్ సినిమా చేసినా ముందు అట్లీ సినిమా కంప్లీట్ చేయాలని .. లేదా అట్లీ సినిమా కొంత షూటింగ్ చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మీదకు వద్దామనుకుంటున్నట్టు టాక్ ? ఒక వేళ బన్నీ ముందుగా అట్లీ సినిమాకు కమిట్ అయితే ఇక త్రివిక్రమ్ మరో రెండేళ్ల పాటు ఖాళీగా ఉండక తప్పదు.
అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రామ్ లేదా విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయవచ్చు అన్న పుకార్లు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో నడుస్తున్నాయి. ఎంత వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రు. 300 కోట్లు రాబట్టినా అన్ని సార్లు ఆ మ్యాజిక్ వర్కవుట్ కాదు. పైగా త్రివిక్రమ్ అంటే బడ్జెట్ చాలా ఎక్కువ ఉంటుంది. నాన్ తియేటర్ ద్వారా ఎంత లేదన్నా రు. 100 కోట్ల కు పైనే రావాలి. మరి ఈ లెక్కలు అటు వెంకటేష్ తో కాని .. ఇటు అసలు హిట్ కోసం నానా తంటాలు పడుతున్న రామ్ తో కాని సాధ్యం అవుతుందా ? అంటే చెప్పలేం.
ఇదిలా ఉంటే ఇప్పుడు త్రివిక్రమ్ చూపు తమిళ హీరో శివ కార్తీకేయన్ మీద పడిందని అంటున్నారు. ఇందుకు కారణం శివ కార్తీకేయన్ తో తీస్తే అటు తమిళం లో మంచి బజ్ ఉంటుంది. ఇటు తెలుగులో త్రివిక్రమ్ పేరు చెప్పుకుని మంచి గా మార్కెట్ చేసుకోవచ్చు ... అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ కన్ను శివ కార్తీకేయన్ మీద ఉందని అంటున్నారు.