టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి డైరెక్టర్లలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈ దర్శకుడు పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు తనదైన స్టైల్ లో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్నారు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ అయి మంచి గుర్తింపు అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తో భారీగా కలెక్షన్లను రాబట్టింది.



 దీంతో మరోసారి గోపీచంద్, బాలకృష్ణ కాంబినేషన్లో మరో సినిమా చేయాలని అభిమానులు డిమాండ్లు చేశారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తీయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో సమాచారం అందుతుంది. మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఈ సంవత్సరం చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభించాలని గోపీచంద్ మలినేని నిర్ణయం తీసుకున్నారట.


అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గోపీచంద్ మలినేని ఓ సినిమా తీయాలని ప్లాన్ లో ఉన్నారట. పవన్ కళ్యాణ్ తో కలిసి పక్కా యాక్షన్ ఫిల్మ్ తీసేందుకు గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమా షూటింగ్ 2026 సంవత్సరంలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలకృష్ణతో, మరోవైపు పవన్ కళ్యాణ్ తో సినిమాలతో ఫుల్ బిజీగా ఉండనున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. తనకు సమయం దొరికినప్పుడల్లా ఇదివరకే కమిట్ అయిన సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి అనేక సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. తనకు సమయం దొరికినప్పుడల్లా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: