హీరోయిన్ పూజ హెగ్డే సరైన సక్సెస్ అందుకోలేక కొన్నేళ్లు అవుతూ ఉన్నది. 2022లో వచ్చిన రాధే శ్యామ్ సినిమా నుంచి ఈమెకు వరుస ప్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో నటించిన సక్సెస్ కాలేదు. ఇక దీంతో ఇతర భాషలలో నటించడానికి సిద్ధమైన పూజా హెగ్డే అక్కడ కూడా సరైన సక్సెస్ కాలేకపోతోంది. కోలీవుడ్ పరిశ్రమ పైన దృష్టి పెట్టిన పూజా హెగ్డే అక్కడ వరస సినిమాలతో బిజీగా ఉన్నది. రజనీకాంత్ తో కూలి సినిమాలో పాటుగా సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.


రెట్రో సినిమా మే ఒకటవ తేదీన రిలీజ్ కాబోతున్న సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న పూజా హెగ్డే పలు విషయాలను వెల్లడించింది. ఇలాంటి సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ ను కూడా తెలియజేసింది.. ఎంతోమంది స్టార్ హీరోలతో డిఫరెంట్ స్టైల్లో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సినిమాలో అవకాశం రావడం తనకు చాలా రంగా వద్దని వెల్లడించింది పూజ హెగ్డే.

సూర్య గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే తమిళంలో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితం ఆయనతో పని చేసినంత సేపు చాలా ప్రశాంతంగానే సినిమా షూటింగ్ అయిపోతుందని తెలియజేసింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం మీరు జిగేల్ రాణిగా గుర్తుంచుకున్నారని చెప్పగా అందుకు పూజా హెగ్డే ఏ యాక్టర్ కైనా అదొక బెస్ట్ కాంప్లిమెంట్ గా మారుతుంది తన చేసిన క్యారెక్టర్ గుర్తింపుగా బుట్ట బొమ్మ జిగేల్ రాణి వంటి పేర్లు కూడా తనకు పెద్ద కాంప్లిమెంట్స్ అని వెల్లడించింది. అలాగే మీరు తెలుగులో నటించి మూడేళ్లు అవుతుంది మిమ్మల్ని మిస్ అవుతున్నామని ప్రశ్నించగా.. అందుకు పూజా హెగ్డే తాను మంచి స్టోరీ క్యారెక్టర్ కోసమే ఎదురు చూస్తున్నాను షూటింగ్ కోసం సెట్ లో వెళుతున్నప్పుడు ఎగ్జైటింగ్ గా అనిపించాలి ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా పూజ హెగ్డేను చూడాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసమే తెలుగు ఆడియన్స్ కోసం ట్రై చేస్తున్నాను ఒక సినిమాకు కూడా సైన్ చేశానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: