తెలుగు చిత్రసీమకి చెందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి సినిమా ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు సంగీత విభాగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన  దర్శకుల లిస్టులో థమన్ ఖచ్చితంగా ఉంటాడు.  'కిక్', 'దూకుడు', 'అల వైకుంఠపురములో' వంటి సినిమాలతో థమన్ మాస్ ఆడియన్స్‌ను తనవైపుకు తిప్పుకున్నాడు. అయితే తాజాగా ఈ దర్శక దిగ్గజం ఓ ఆసక్తికరమైన అంశాన్ని జనాలతో పంచుకున్నాడు. దాంతో తన పేరుతో సంబంధం ఉన్న ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

విషయం ఏమిటంటే? ఒక ఇంటర్వ్యూలో యాంకర్ సుమ తమన్‌ను ప్రశ్నిస్తూ, కొన్ని సినిమాల్లో.. S తమన్, మరికొన్నింట్లో SS తమన్? ఎందుకిలా? అనే ప్రశ్నని సాధించగా... థమన్ దానికి వివరణ ఇచ్చుకొచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడిన థమన్ తన గురించి మాట్లాడుతూ... “నా అసలు పేరు ఎస్‌ తమన్. అయితే ఒకరోజు ఒకరు ‘SS తమన్’ అని టైటిల్ కార్డులో వేసారట. ఆ పేరును చూసి మిగతా సినిమాలకూ అదే తరహా ఫార్మాట్‌ను ఫాలో అయ్యారు దర్శక నిర్మాతలు. అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత చూస్తే, ఆ పేరుతో వచ్చిన సినిమాల్లో చాలా ఫ్లాప్ అయ్యాయి. ఈ పేరుపై నాకు నమ్మకం లేకపోవడం కాదు… కానీ ఆ టైంలో ఆడియన్స్, మేకర్స్ లో కొంత కన్ఫ్యూజన్ అనేది పుట్టుకొచ్చింది. అందుకే ఇకపై స్పష్టత కోసం ఎస్ తమన్‌గానే ఫిక్స్ అయ్యాను,” అని వివరించారు.

ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ మాదిరిగానే తమన్ కూడా తన బ్రాండ్ పేరును నిలబెట్టుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. పేరులో చిన్న మార్పే అయినా, అది క్రియేటివ్ ఫీల్డ్‌లో చాలా పెద్ద ప్రభావం చూపించగలదని థమన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈమధ్య కాలంలో తమన్ సినిమాల సంఖ్యను తగ్గించి, క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్ధం అవుతోంది. ‘అఖండ ’ నుంచి మొదలైన ఈ మార్పు, ‘సర్కారు వారి పాట’, ‘బ్రో’ వంటి సినిమాల వరకూ కొనసాగింది. ప్రస్తుతం అఖండ 2తో పాటు మరికొన్ని బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో తదితర ప్రాజెక్టులపై పనిచేయున్నారనే టాక్ చాలా గట్టిగానే వినబడుతోంది. ఇక లిస్టులో అఖిల్ లెనిన్, ప్రభాస్ రాజాసాబ్, పవన్ OG వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తమన్ ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం స్పెషల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: