ఇక చిత్ర పరిశ్రమ నుంచి వారానికి కనీసం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి .. అలా సినిమాలు వచ్చిన వెంటనే సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు చిత్ర యూనిట్ .. అలాగే ఆ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు .. కానీ వాస్తవం ఏమిటంటే ఈ రీసెంట్‌ టైమ్స్ లో అసలు ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళటం లేదు .. ఇది నగ్న సత్యం .. అయితే ఈ మాట మీడియా రాస్తే మీడియాకు ఏం తెలుసు ? ఫుట్ పాల్స్ బాగున్నాయి మా బడ్జెట్ వర్క్ అవుట్ అవుతుంది అని చెప్తారు నిర్మాతలు ..


కానీ వాస్తవం మాత్రం అదికాదు .. అయితే ఇదే విషయం దర్శకుడు  త్రినాధరావు నక్కిన ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు .. దర్శకుడు  త్రినాధరావు నక్కిన నిర్మాతగా చేసిన మూవీ చౌర్యపాఠం . ఈ సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇక ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విషయాలన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు .  ప్రేక్షకులు థియేటర్స్ కి అసలు రావడం లేదు .. షోలు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి .. థియేటర్లో సెకండ్ షోలే ఎత్తేశారు .  


పరిస్థితి చాలా దూరంగా ఉంది .  నేను స్వయంగా థియేటర్స్ కి వెళ్లి కూడా చూశాను .  సినిమాల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది .  స్టార్ హీరోల సినిమాలకే జనం రావట్లేదు .. ఇక కొత్తవారితో సినిమా చేస్తున్న నిర్మాతలు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని ఆయన అసలు విషయాన్నీ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు .. దర్శకుడు త్రినాధరావు నక్కిన రవితేజతో చేసిన ధమాకా తో 100 కోట్ల క్లబ్లో చేరాడు .. ఇప్పుడు ఇలాంటి దర్శకుడు ప్రస్తుతం థియేటర్స్ అసలు పరిస్థితి చెప్పటం ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనే హాట్ టాపిక్ గా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి: