సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య గురించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో  రాజ్ తరుణ్ పైన లావణ్య చేసినటువంటి వ్యాఖ్యలు అన్ని ఇన్ని కాదు ఏకంగా రాజ్ తరుణ్ పైన కేసు పెట్టడమే కాకుండా తనను అన్ని విధాలుగా వాడేసుకున్నారు అంటూ ఫిర్యాదు చేసింది.. మధ్యలో ఎంతోమంది పేర్లు కూడా వినిపించాయి. అయితే ఆ తర్వాత ఎందుకో సైలెంట్ అయినప్పటికీ మళ్లీ ఇప్పుడు తాజాగా రాజ్ తరుణ్, లావణ్య రచ్చ మొదలైనట్లు కనిపిస్తుంది. తాజాగా లావణ్య ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది.

లావణ్య ఇంటి ముందు రాజు తరుణ్ తల్లిదండ్రుల సైతం నిరసన చేస్తూ తమన్న ఇంట్లోకి అనుమతించడం లేదంటూ ఆందోళనకు దిగారట. అయితే ఒక 15 మంది తీసుకువచ్చి మరి రాజ్ తరుణ్ తల్లితండ్రులు దాడి చేశారంటూ లావణ్య కూడా ఆరోపిస్తున్నది.. ఈ విషయంపైన లావణ్య మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కొంతమందిని తీసుకువచ్చి తనని జుట్టు పట్టుకొని మరి ఇంటి నుంచి బయటికి లాక్కొచ్చారని.. తన ఇంటి వద్ద ఉండే సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని వెల్లడించింది.


తన తమ్ముడి పైన క్రికెట్ బ్యాట్ తో దాడి చేశారని .. ఈ దాడి నాకు చాలా బాధాకరంగా అనిపించింది ఇక రాజ్ తరుణ్ వదిలిపెట్టను కోర్టు మెట్లు ఎక్కిస్తా అంటూ.. తాను 15 ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉంటున్నానంటూ వెల్లడించింది లావణ్య.. అయితే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాత్రం లావణ్య ఉంటున్నటువంటి ఇల్లు రాజు తరుణ్ దని తాను సొంతంగా కష్టపడి ఇల్లు కట్టుకున్నారని రాజు తరుణ్  ఇక్కడ ఉండనివ్వడం లేదు ,మమ్మల్ని కూడా అసలు ఉండనివ్వకుండా చేస్తోంది.. రాజ్ తరుణ్ ఒక ఇంట్లో తాము ఒక ఇంట్లో ఉన్నామని.. సొంతంగా ఇల్లు ఉన్నప్పటికీ కూడా అద్దె ఇంట్లో ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది తాము ప్రస్తుతం నడవలేదు పరిస్థితుల్లో ఉన్నాము తన కుమారుడు సినిమాలు తీసి కట్టుకున్న ఇల్లుని లావణ్య పాడు చేస్తోంది, అసాంఘిక కార్యక్రమాలు చేస్తుందని అంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: