టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే ఎలాంటి సపోర్ట్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై మంచి గుర్తింపు అందుకుంటారు. అలాంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఈ పొడుగు కాళ్ళ సుందరి సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక లైలా కోసం సినిమాతో నాగచైతన్య సరసన హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. ఆ సినిమాలో తన నటన, అందచందాలకు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఈ సినిమా అనంతరం ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాలను ఈ చిన్నది అందుకుంది.


అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా చేసిన పూజ హెగ్డే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగించింది. ఆ సినిమా అనంతరం తెలుగులో ఎన్నో సినిమాలలో అవకాశాలను అందుకుంటుందని ఎంతోమంది అనుకున్నారు. కానీ అల వైకుంఠపురం సినిమా అనంతరం ఈ చిన్న దానికి తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే హీరోయిన్ గా నటించింది. మరికొన్ని సినిమాలు ఓకే అయినప్పటికీ ఏమైందో తెలియదు సినిమాలలో అవకాశాలను కోల్పోవడం నిజంగా బాధాకరం.


 ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ సాఫీగా కొనసాగిస్తుంది. పూజ హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్ల సంఖ్యను బాక్సాఫీస్ ను డిసైడ్ చేయలేదంటూ పూజ హెగ్డే అన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో తనకు 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని పూజా హెగ్డే చెప్పారు.

 కానీ వారందరూ థియేటర్లకు వస్తారని నమ్మకం ఉండదు. చాలామంది హీరో హీరోయిన్లకు 5 మిలియన్ల కన్నా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటివారు ఎంతోమంది సక్సెస్ఫుల్ గా వారి కెరీర్ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉంటుందని పూజా హెగ్డే వెల్లడించారు. సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లు సినిమా రిలీజ్ అయిన సమయంలో ఉండరు అంటూ పూజ హెగ్డే అన్నారు. ప్రస్తుతం ఈ చిన్నవి షేర్ చేసుకున్న ఈ విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: