మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి పరిచయమైన రామ్ చరణ్ తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన రామ్ చరణ్ డిజాస్టర్ సినిమాలను చవిచూశారు. అయినప్పటికీ సినిమాల ఫలితాన్ని ఏమాత్రం చూడకుండా వరుసపెట్టి సినిమాలలో నటిస్తూ బిజీ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు.


ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా పూర్తయిన అనంతరం రామ్ చరణ్ మరో సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రామ్ చరణ్సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. గతంలో సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాను అనౌన్స్ చేశారు.

అయితే ఆ సినిమాను అల్లు అర్జున్ రిజెక్ట్ చేయగా ఇప్పుడు అదే సినిమాను రామ్ చరణ్ తో కలిసి తీయబోతున్నారట సందీప్ రెడ్డి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సంప్రదింపులు కూడా జరిగాయట. రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ సైతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. యానిమల్ పార్క్ సినిమాతో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన అనంతరం రామ్ చరణ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: