సమంత ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన  అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ చిన్నది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులలోనే స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. సమంత తెలుగులో అనేక సినిమాలలో నటించి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం పొందింది. 



తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనూ నటించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపును పొందింది. ఇక సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకోవడం ఈ చిన్న దానికి చాలా అలవాటు. ఇక సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. సమంతకు మళ్ళీ కొత్త సమస్యలు మొదలయ్యాయని ఓ రూమర్ ను వైరల్ చేస్తున్నారు.

సమంత మళ్లీ అనారోగ్యం పాలైనట్టుగా ఓ వార్త వినిపిస్తోంది. మళ్లీ తాను మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్టుగా ఎప్పటిలానే సమంతను మళ్ళీ ఆ వ్యాధి వెంబడిస్తుందనే వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేక రకాలుగా వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. నిజంగానే సమంతకు మయోసైటిస్ వ్యాధి వచ్చినట్లయితే తన కుటుంబ సభ్యులు, అభిమానులు చాలా బాధపడతారు. కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సమంత ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉందని కొంతమంది అంటున్నారు. ఈ వార్తలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: