
ఇవన్నీ పక్కన పెడితే తెలుగు ఇండస్ట్రీలో కూడా త్రిష ఫుల్ బిజీ కాబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తూ ఉండగా వీటికి తోడు మరో రెండు ప్రాజెక్టులను కూడా ఈమె తీసుకొని అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందట. అందులో ఒకటి SSMB-29 చిత్రంలో కీలకమైన పాత్రలో త్రిష నటించిన అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ తో కలిసి అతడు సైనికుడు వంటి చిత్రాలలో నటించిన త్రిష ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో కూడా నటించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో త్రిష కూడా ఒక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు జోరు అందుకుంటున్నాయి. అలాగే కొద్దిరోజుల క్రితం విడుదలైన ఐడెంటిటీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న త్రిష ఇందులో తన నటనతో మెప్పించింది. అలాగే స్టార్ మోహన్లాల్ నటిస్తున్న రామ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్షన్ వహిస్తూ ఉండడం గమనార్హం. ఇదే కాకుండా తెలుగులో వచ్చే ఎలాంటి అవకాశాలను కూడా త్రిష వదులుకోకూడదనే విధంగా కథలు వింటూ నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.