సీనియర్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో సినిమాలు చేయాలని ఒకప్పుడు అనేకమంది టాప్ హీరోలు ఎంతో ఆశక్తి కనపరిచేవారు. అలాంటి పూరీ ప్రస్తుతం వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్నాడు. ‘లైగర్’ ‘డబల్ ఇస్మార్ట్’ మూవీలు వరస ఫ్లాప్ లుగా మారడంతో ప్రస్తుతం కథ చెప్పాలని ఆశక్తి కనపరుస్తున్నప్పటికీ అతడి ఫోన్స్ కు చాలామంది హీరోలు స్పందించడంలేదు అన్న గసిప్పులు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో పూరీ చెప్పిన ఒక డిఫరెంట్ కథకు తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓకె చేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈమూవీలోని ఒక కీలక పాత్రలో టబు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ హీరోయిన్ గా రాధికా ఆప్టే నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ తాను పూరీ ట్రాక్ రికార్డును చేసి కాకుండా తనకు పూరే చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో తాను ఈమూవీని చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.


మొదట్లో ఈమూవీకి ;బెగ్గర్’ అన్న టైటిల్ అనుకున్నప్పటికీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ‘బిచ్చగాడు’ మూవీ ఛాయలు తన మూవీ పై పడతాయి అన్న భయంతో ప్రస్తుతం పూరీ ఈసినిమాకు సంబంధించి మరొక టైటిల్ అన్వేషణలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కధలో మాఫియా, దుబాయ్, డ్రగ్స్ కాకుండా మరో కొత్త ప్రపంచాన్ని చూపెట్టబోతున్నాడు అన్న  ప్రచారం జరుగుతోంది.


స్క్రిప్ట్ పక్కాగా సిద్ధం చేసుకున్న పూరి జగన్నాధ్ స్పీడ్ విషయంలో  ఎలాంటి రాజీ పడకుండా ఈమూవీని వేగంగా పూర్తి చేయాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈమూవీకి సంబంధించి సంగీత దర్శకుడుగా జివి ప్రకాష్, సంతోష్ నారాయణన్ లలో ఒకర్ని ఎంపిక చేస్తారని టాక్. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ విడుదల ఈ సంవత్సరంలోనే ఉంటుంది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: