టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మరి కొంతమంది పెద్దగా అదృష్టం కలిసా రాక హీరోయిన్లుగా రాణించలేక పోతారు. అలాంటి హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. అందులో నటి ఎస్తర్ ఒకరు. ఈ చిన్నది చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయినప్పటికీ తన సినిమాలతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాను నటించిన సినిమాలలో కేవలం ఒకే ఒక సినిమా సక్సెస్ అయింది. మిగతావన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.


ఇక ఈ చిన్నది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కొన్ని సంచలన కామెంట్లు చేసింది. అందులో భాగంగానే తాను కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకుంటే ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా ఎదిగే దానిని అంటూ హాట్ కామెంట్స్ చేసింది. అంతేకాకుండా ఎస్తేర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ఎస్తేర్ నిజ జీవితంలోనూ సింగర్ నోయల్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వారి వైవాహిక జీవితం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. కేవలం 6 నెలల సమయంలోనే ఈ జంట విడాకులు తీసుకున్నారు.


విడాకుల తర్వాత ఎస్తేర్ సినిమాలలో ఏవో కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా సమయాన్ని గడుపుతోంది. అంతేకాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వంటి కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంది. అయితే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు కూడా తనను కమిట్మెంట్స్ అడుగుతున్నారని ఎస్తేర్ అసలు విషయం చెప్పేసింది. ఎస్తేర్ షేర్ చేసుకున్నా ఈ విషయంపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది నీకు ఎప్పుడూ ఎవరో ఒకరిపై ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం చాలా అలవాటు అయిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎస్తేర్ షేర్ చేసుకున్న ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఎస్తేర్ షేర్ చేసుకున్న ఈ విషయాలు సంచలనంగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: