ఒక‌ప్పుడు హీరోయిన్ గా అద‌ర‌గొట్టిన ఛార్మి ప్ర‌స్తుతం ప్రొడ్యూస‌ర్ గా మారిన సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ లో క‌లిసి ఛార్మీ ఓ బ్యాన‌ర్ ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నారు. చివ‌రిగా వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా ప్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది. ఈ సినిమా కంటే మందు లైగ‌ర్ సినిమా తెర‌పైకి వ‌చ్చింది. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన హైప్ ఒక‌లా ఉంటే సినిమా మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. 

ఇలా వ‌రుస సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో ఛార్మీ న‌ష్టాల్లో కూరుకుపోయింది అనే వార్త‌లు కూడా గ‌ట్టిగానే వినిపించాయి. ఇక సినిమాల్లో న‌టన‌కు దూరం అయిన త‌ర‌వాత ఛార్మీ పెద్ద‌గా టీవీ ఈవెంట్స్ లో కూడా క‌నిపించ‌డం లేదు. తాను నిర్మించిన సినిమాలు విడుద‌లైన స‌మ‌యంలో ఆడియో ఫంక్ష‌న్స్ ఇత‌ర ఫంక్ష‌న్స్ త‌ప్ప మ‌ళ్లీ క‌నిపించ‌డం లేదు. కానీ అప్పుడ‌ప్పుడూ సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. చిల్ అవుతున్న ఫోటోలు, షూటింగ్ ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే లైగ‌ర్ త‌ర‌వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉన్న ఛార్మీ తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

ఆ పోస్టులో తాను ఏం తింటుందో ఫోటోల‌తో షేర్ చేసింది. ఇక అందులో చేప‌లు, ఇడ్లీలు, బ్రెడ్, ప‌న్నీరు, డ్రై ఫ్రూట్స్, రైస్ ఉన్నాయి. దీంతో ఛార్మీ డైట్ చేస్తున్నావా ఆంధ్రా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఛార్మీ, పూరీ ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తితో సినిమాను సెట్ చేశారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఛార్మి నటిస్తున్న ఈ సినిమా అయినా విజ‌యం సాధిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: