బిగ్ బాస్ బ్యూటీ దామిని భట్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది సింగర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సింగర్ గా తన అద్భుతమైన స్వరంతో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపును అందుకుంది. ఎన్నో బ్లాక్బస్టర్ పాటలకు ఈ చిన్నది తన గొంతును అందించింది. తన స్వరంతో మాత్రమే కాకుండా అందంతోను దామిని ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది. కాగా, ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. హౌస్ లో దామిని ఉన్నది తక్కువ సమయమే అయినప్పటికీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది.


తన అద్భుతమైన ఆట తీరు, చలాకీతనంతో ఎంతోమందిని మైమరపించింది. ఇక దామిని పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ను కూడా క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దామిని సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను కూడా నిర్వహిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, పర్సనల్ విషయాలను అన్నింటిని దామిని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ దామిని చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

హాట్ గా తన అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్లు చేయగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక దామిని ఫోటోలకు కొంతమంది పాజిటివ్ గా స్పందించగా.... మరి కొంత మంది నెగిటివ్ గా స్పందిస్తారు. అలాంటి వారికి దామిని తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. ఇక దామిని రీసెంట్ గా ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిగత విషయాలను అన్నింటినీ షేర్ చేసుకున్నారు.

అందులో భాగంగానే తనకు వైన్ అంటే చాలా ఇష్టమని దామిని చెప్పారు. తనకు వైన్ తాగే అలవాటు ఉందని వైన్ అంటే చాలా ఇష్టమని సంచలన కామెంట్స్ చేసింది. ఇక దామిని తన కుటుంబ సభ్యులతో కాకుండా సపరేట్ గా ఉంటుందనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఒక అమ్మాయి సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడడం చాలా అవసరం అంటూ దానిని ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం దామిని షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: