జాన్వి కపూర్ .. పేరుకి పెద్ద బ్స్డా ఫ్యామిలీ నుంచి వచ్చింది.  కానీ ఆఫర్స్ మాత్రం ఎలాంటివి తన వద్దకు వస్తున్నాయో అందరికీ తెలిసిందే . ఏదో బోనీ కపూర్ పుణ్యమా అంటూ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాలో ఆఫర్ పట్టేసింది . అయితే ఈ సినిమా మాత్రం సక్సెస్ ఇవ్వలేకపోయింది . ఇప్పుడు రామ్ చరణ్ సరసన ఒక సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాతో అయిన తన కోరిక నెరవేరుతుంది అని ఆశ పడుతుంది జాన్వీ కపూర్. ఇది కాకుండా అఖిల్ సరసన ఒక మూవీ అదేవిధంగా విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అంటుకున్నట్లు తెలుస్తుంది .


మరీ ముఖ్యంగా డైరెక్టర్ అట్లీ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ఫిక్స్ అయ్యింది అంటే తెగ ప్రచారం జరుగుతుంది . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు మరొక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. జాన్వి కపూర్ ఓ సినిమాలో ఆఫర్ కోసం గట్టిగా ట్రై చేస్తుందట . ఎంతలా అంటే ఆ సినిమాలో ఛాన్స్ కోసం తనకున్న పలుకుబడి మొత్తం హై రికమండేషన్ యూజ్ చేస్తుందట.  ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా..? హను రాఘవపూడి  దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న  సినిమా ఫౌజి.



ఈ సినిమాలో మరొక హీరోయిన్ నటించే క్యారెక్టర్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్యారెక్టర్ కోసం ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అంటూ సెర్చ్ చేస్తున్నారట మేకర్స్, అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్న జాన్వి కపూర్ హై రికమెండేషన్ తో ఆ రోల్  కొట్టడానికి బాగా కష్టపడుతుందట . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. బాగా వైరల్ గా మారింది. జాన్వి కపూర్ లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది అంటే ప్రభాస్ రేంజ్ ఏంటో  అర్థం చేసుకోవచ్చు.  ఈ సినిమా ఖచ్చితంగా ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: