ఏంటి అక్కినేని నాగార్జున ఆ ఇద్దరు ప్రాణ మిత్రుల మధ్య చిచ్చుపెట్టాడా.. నాగార్జున వల్లే ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోయారా..ఇంతకీ నాగార్జున కారణంగా విడిపోయిన ఆ ప్రాణ స్నేహితులు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.నాగార్జున కారణంగా విడిపోయింది ఎవరో కాదు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్,దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి..అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ చక్రి బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొని ఆవేదన చెందారు. మరి ఇంతకీ పూరి జగన్నాథ్ చక్రి మధ్య నాగార్జున ఎందుకు చిచ్చు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.. కొంతమంది డైరెక్టర్లతో మ్యూజిక్ డైరెక్టర్లకి హిట్ పెయిర్ ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వారికి అదృష్టంగా ఉన్నవారినే ఎంచుకుంటూ ఉంటారు. 

అలా సుకుమార్ డీఎస్పీ కాంబో ఎలా ఉంటుందో గతంలో పూరి జగన్నాథ్ కూడా తన సినిమాలకు ఎక్కువగా చక్రినే మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకునేవారు. అలా వీరి కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. అలా వీరి కాంబో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో నాగార్జున వీరి మధ్య చిచ్చు పెట్టారట.. అదేలాగో చక్రి మాటల్లోనే విందాం. బతికున్న సమయంలో చక్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసిన ప్రతి ఒక్క సినిమాకి మ్యూజిక్ అందించాను. కానీ నాగార్జునతో చేసిన సూపర్ మూవీకి మాత్రం నాగార్జున నన్ను పక్కన పెట్టి హిందీ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌటాని తీసుకున్నారు.

ఆ టైంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే పూరీ తన సినిమాలన్నింటికి నన్నే తీసుకున్నాడు.  కేవలం నాగార్జున కారణంగానే సూపర్ సినిమాకి నన్ను పక్కన పెట్టాడు.ఆ తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ తో నేను సినిమా చేయలేదు. అలా మా మధ్య నాగార్జున కారణంగా దూరం పెరిగింది అంటూ చక్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలా నాగార్జున కారణంగా పూరి జగన్నాథ్ చక్రిలు ఇద్దరు విడిపోయారు. నాగార్జున సూపర్ సినిమా తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ తో కలిసి చక్రి ఒక్క సినిమా కూడా చేయలేదు. అలా వీరి మధ్య నాగార్జున దూరం పెంచేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: