- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత ఏడాది కాలం నుంచి వెయిటింగ్ లో ఉన్నారు. గత సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమాతో అనుకున్న సక్సెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమాను బన్నీ తో చేయాలని ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ కు మొన్న డిసెంబర్ వరకు బన్నీ దొరకలేదు. పుష్ప  2 సినిమా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు సాధించింది .. దీంతో బ‌న్నీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ నేషనల్ హీరో అయిపోయాడు. బన్నీతో సినిమా చేయాలంటే ఆస్కేల్ ... ఆ లెక్కలు వేరుగా ఉన్నాయి.


దీంతో బన్నీ కూడా త్రివిక్రమ్ కంటే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ - అట్లీ సినిమా ఖరారు కావడంతో ఈ గ్యాప్లో ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో తమిళ్ హీరో శివ కార్తికేయనుకు ఆయన ఒక కథ చెప్పగా ... తన రెమ్యూనరేషన్ గా 70 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ అడిగిన 70 కోట్ల అమౌంట్ విని త్రివిక్రమ్ మైండ్ బ్లాక్ అయిపోయిందట. అంత రెమ్యూనరేషన్ అంటే వర్కౌట్ కాదని త్రివిక్రమ్ ... శివ కార్తికేయ‌న్ తో సినిమా చేసేందుకు ఆసక్తి కనప‌ర్చ‌డం లేదని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ హీరో వెంకటేష్ కూడా త్రివిక్రం కథ చెప్పగా ఆయన ఓకే చెప్పాల్సి ఉంది. అలాగే యంగ్ హీరో రామ్ తో కూడా సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: