స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత దేవర మూవీలో నటించి పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక వచ్చే నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. మ్యాన్ ఆఫ్ మాసెస్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఏరాని ఏలిన సినిమా మరోసారి తెరపైకి రానుంది.

ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా మే 20న రీరిలీజ్ కానుంది. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే యమదొంగ సినిమాని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. ఈ సినిమాని జకన్న విజువల్ ఎఫెక్ట్స్ తో తీశారు. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియమణి నటించింది. మోహన్ బాబు, అలీ, బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీని ఎన్టీఆర్ బర్త్ డే రోజున వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం. 1 సినిమాలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, అశోక్, రాఖీ, యమదొంగ, జనతా గ్యారేజ్, అదుర్స్ లాంటి సినిమాలలో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్టీఆర్ లావుగా ఉన్నాడని చాలా విమర్శలు ఎదురుకున్నప్పటికి.. ఆ రోజు వెనకడుగు వేయకుండా నిలిచి ఈ రోజున స్టార్ హీరో అయ్యాడు. ఒక్కో అడుగు పైకి ఎక్కుతూ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఎన్టీఆర్ నటన చాలా అద్బుతంగా ఉంటుంది. అలాగే ఈయన డాన్స్ చేస్తే మాత్రం, ఎవరు ఈయనకి పోటీగా రారంటే అతిశయుక్తి కాదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: