టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి తాజాగా సారంగపాణి జాతకం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా ... వెన్నెల కిషోర్ , వైవా హర్షమూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు . ఈ మూవీ ని ఏప్రిల్ 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు . అందుకు తగినట్లుగా ఈ సినిమా బృందం వారు ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను కూడా నిర్వహిస్తూ వచ్చారు.

కానీ సడన్గా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఏప్రిల్ 18 వ తేదీన కాకుండా ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీ 2 గంటల 15 నిమిషాల 06 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రియదర్శి "కోర్టు" అనే సినిమాలో హీరోగా నటించే మంచి విజయాన్ని అందుకున్నాడు.  కోర్టు లాంటి భారీ విజయం తర్వాత ప్రియదర్శి నటిస్తున్న మూవీ కావడంతో సారంగపాణి జాతకం మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: