- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మొదలుపెట్టి వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇస్తున్నారు. అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్‌ కేసరి తాజాగా ఈ సంక్రాంతికి డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. బాబి కొల్లి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా బాలయ్యకు వరుసగా నాలుగో హిట్ సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ కు అరుదైన గౌరవం దక్కింది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ .. ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ భార్య‌ సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో డాకు మహారాజ్ సినిమా ను నిర్మించారు. ఇందు‌లో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా , శ్రద్ధా శ్రీనాథ్ , చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ . థమన్ స్వరాలు సమకూర్చారు. టీజర్ , ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఇక బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. బాలకృష్ణ నట విశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఫిదా అవుతారు. అయితే ఎప్పుడు ఉద్రిక్తంగా ఉండే ఇరాక్ సైతం ఫిదా అయింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాపత్రిక డాకు మహారాజ్ సినిమా అందులో హీరో పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఓ రివ్యూ ప్రచురించింది. హీరో ను చాలా పవర్ఫుల్గా చూపించారని ... సినిమాలో టెక్నికల్ వాల్యూస్ , యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని ఆ కథనంలో పేర్కొంది. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక తెలుగు సినిమా గురించి ఎక్కడో ఇరాక్ దేశంలో పేపర్ లో రావటం తమ హీరో చాలా గ్రేట్ అని బాలయ్య అభిమానులు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: