- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నిరంజన్ రెడ్డి ప్రముఖ నిర్మాతగా తెలుగు సినిమా పరిశ్రమంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. హనుమాన్ సినిమాకు ముందు ఆయన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అనే సినిమాను నిర్మించారు. అయితే హనుమాన్ సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఆయన రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన డబుల్‌ ఇస్మార్ట్ సినిమాను ఆంధ్రప్రదేశ్ - తెలంగాణకు హోల్సేల్గా కొని పంపిణీ చేశారు. అయినా ఎక్కువ మంది నిరంజన్ రెడ్డి అంటే హనుమాన్ సినిమా నిర్మాతగానే గుర్తిస్తారు. ప్రస్తుతం నిరంజన్ రెడ్డి సాయిధరమ్ తేజ్ హీరోగా సంబరాల ఏటిగట్టు - సుదీప్ హీరోగా బిల్లా రంగ భాషా అనే మరో సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నిరంజన్ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు పూరి జగన్నాథ్ ఛార్మితో పాటు కొందరు తనను మోసం చేశారని భావించి ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించినట్టు టాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


హనుమాన్ సినిమా హిట్ అయ్యాక ప్రశాంత్ వర్మ మైత్రి వాళ్లతో కలిసి ఆ సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హనుమాన్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన నిరంజన్ రెడ్డిని ఈ విషయంలో ప్రశాంత్ వర్మ మోసం చేశారని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే పూరీ జగన్నాథ్ - చార్మి నిర్మాతలుగా డబుల్‌ ఇస్మార్ట్ సినిమా రైట్స్‌ను ఆయన భారీ రేటు పెట్టి కొనుగోలు చేశారు. ఈ సినిమా వల్ల తనకు 30 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని .. ఈ నష్టానికి పూరి జగన్నాథ్ - చార్మి నుంచి ఎలాంటి పరిహారం రాలేదని ఆయన నిరాశతో ఉన్నట్టు తెలుస్తుంది. నిరంజన్ రెడ్డి కేవలం నిర్మాత మాత్రమే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా ..చాలా ఏరియాలో చాలా సినిమాలు పంపిణీ చేయగా కొన్ని సినిమాలు రెండు రాష్ట్రాలలో భారీ రేట్లకు కొని నష్టపోయారు. కొన్ని నిర్మాణ సంస్థలతో పాటు ప్రశాంత్ వర్మ , ఛార్మి , పూరి జగన్నాథ్ పై ఆయన ఒకేసారి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: